NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు మండలం  గ్రామం పసుపల గ్రామంలో టీచర్ శేషు  ఆహ్వానం మేరకు కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన  ప్రవీణ్ కుమార్ – జ్యోష్న వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి .అలాగే కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన అయ్యన్న  ఆహ్వానం మేరకు వారి కుమారుడు పవన్ కుమార్ మరియు వెంకటేశ్వరమ్మలను ఆశీర్వదించారు సి.బెళగల్ మండలం మారం దొడ్డి గ్రామంలో టిడిపి కార్యకర్త గోవిందు  కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులైన మహేష్ – శిరీష జంటను ఆశీర్వదించారు.అదేవిధంగా సి.బెళగల్ మండలం కంపాడు గ్రామంలో టిడిపి కార్యకర్త సురేష్  ఆహ్వానం మేరకు నిర్వహించిన వివాహ వేడుకలకు హాజరై అనిల్ – సజీవ దంపతులను ఆశీర్వదించిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి .అనంతరం సి.బెళగల్ మండలం కంపాడు గ్రామంలో టిడిపి కార్యకర్త హనుమన్న  కుమారుడు రాముడు అలియాస్ దుబ్బన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని విషయం తెలుసుకున్న కోడుమూరు ఎమ్మెల్యే  బొగ్గుల దస్తగిరి  ఇంటికి వెళ్లి  పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా కంపాడు గ్రామ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న దేవ సహాయం  పక్షవాతంతో బాధపడుతుండడంతో ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.

About Author