NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సహయం చేయడం వల్ల వచ్చే సంతృప్తి వెలకట్టలేనిది…

1 min read

డాక్టర్. శంకర్ శర్మ

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు సమీపంలోని దామోదరం సంజీవయ్య  బాల సదనం కు డాక్టర్ శంకర్ శర్మ వాటర్ ట్యాంక్ విరాళంగా ఇచ్చారు. బాలసదనంలో నివాసం ఉంటున్న చిన్నారులకు తనవంతు సహయం ఎల్లప్పుడూ ఉంటుందని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లల భాధ్యతను ప్రభుత్వం తో పాటు సమాజంలో ఉండే విద్యావంతులు, ఉద్యోగులు  సైతం సహయం చేయాలని సూచించారు. మంచిగా చదువుకొని ఉన్నతస్థాయి లో ఉండాలని చిన్నారులకు  తెలియజేశారు. చదువుతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చి ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని అధికారులకు వివరించారు. ఈకార్యక్రమంలో బాలసదనం ఇంచార్జ్ విజయ, యోగా శిక్షకురాలు శ్వేతా పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *