NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుంకులమ్మ దేవి దేవర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

మీట్టమీద దంనచర్ల గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

సుంకులమ్మ దేవి ఆశీస్సులు తీసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

ఘనంగా జరిగిన దేవర మహోత్సవంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు

ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు

ఆలూరు న్యూస్ నేడు: గుంతకల్లు నియోజకవర్గంలోని మీట్టమీద దంనచర్ల గ్రామంలో నిర్వహించిన శ్రీ సుంకులమ్మ దేవి దేవర మహోత్సవంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిప్పగిరి గ్రామవాసి రోశప్ప వెంకటేష్  ఆహ్వానం మేరకు మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే  శ్రీ సుంకులమ్మ దేవి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి దేవర మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్​సిపి కర్నూలు జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు మొల్లగవెల్లి రామాంజినేయులు , వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *