జిల్లాను పారిశ్రామిక అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి
1 min read
క్లస్టర్ ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తే యువతకు సింగిల్ విండో పథకం ద్వారా అనుమతులు మంజూరు
నూతన పరిశ్రమలు స్థాపనకు మౌళిక సదుపాయాలు,బ్యాంకు రుణాలు మంజూరులో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిఐఇపిసి) సమావేశంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిఐఇపిసి) సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, సంబంధిత శాఖల అధికారులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించుటకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలను పూర్తిచెయ్యాలని ఆదేశించారు. గిరిజన తండాల్లో యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు వెలుగులు నింపాలన్నారు. ఐటిడిఏ గిరిజన ఉత్పత్తులు నాణ్యతను మరింత పెంచి, అందమైన ప్యాకింగులు, రవాణా, మార్కెటు సౌకర్యం కల్పించి గిరిజనకుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని అన్నారు. భాగస్వామ్య సదస్సులో (మౌస్) ఏలూరు జిల్లాలో పది పరిశ్రమలు ప్రగతిని మండలాలు వారీగా సమీక్షించారు.జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు టార్గెట్ 168 కాగా 102 గ్రౌండింగు అగుటపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ మిగతా 66 బ్యాంకు రుణాలను ఇప్పించి, ఈనెల చివరినాటికి ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు నూటికినూరు శాతం లక్ష్యాలను పూర్తి చెయ్యాలని ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 130 ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు టార్గెట్ కాగా, ఇదేస్ఫూర్తితో లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీనియోజక వర్గానికి ఇండస్ట్రియల్ (ఎమ్ ఎస్ఎమ్ఇ) పార్కులు చింతలపూడి నియోజకవర్గం ప్రారంభోత్సవానికి సిద్ధం చెయ్యాలని, ఏలూరు నియోజకవర్గం రెండు నెలలోనూ,కైకలూరు, పోలవరం నియోజక వర్గంలో మూడునెలల్లో పూర్తి చెయ్యాలని ఆదేశించారు.రూ 20 లక్షలు వ్యయంతో పచ్చి కొబ్బరి బొండాలతో పీచుపరిశ్రమ యూనిట్ స్థాపనకు ఏలూరు రూరల్ మండలంలో గాని పెదపాడు మండలంలో గాని 50 సెంట్లు భూసేకరణ చెయ్యాలని అన్నారు. యూనిట్ స్థాపనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను గుర్తించాలని డిఆర్డిఏ పిడిని జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, జిల్లా పరిశ్రమలు తనిఖీ అధికారి కె.కృష్ణమూర్తి, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్రబాబు, విద్యుత్తు శాఖ యస్ఇ పి.సల్మాన్ రాజు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, యల్డియం డి.నీలాద్రి, మత్స్యశాఖ డిడి బి.రాజ్ కుమార్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


