NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైబ్రిడ్ విధానంలో ఘనంగా మహానాడు-2026 నిర్వహణ

1 min read

“స్త్రీ శక్తి” థీమ్‌తో టీడీపీ మహానాడు వేడుకలు

1875 క్లస్టర్లలో స్క్రీన్ల ఏర్పాటు – రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల భాగస్వామ్యం

“కార్యకర్తే పార్టీకి అసలైన అధినేత” సందేశంతో మహానాడు

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడు వేడుకలకు ఆహ్వానం

హోలగుందన్యూస్ నేడు;  వేడుకకు హృదయపూర్వక ఆహ్వానంతెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, సంక్షేమ పాలనకు ఆద్యుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే మహానాడు–2026 వేడుకలను ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.తెలుగుదేశం పార్టీ మహానాడు కేవలం పార్టీ కార్యక్రమమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఒక మహా వేడుకగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 27, 28 తేదీలలో మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు-2026ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొననుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 1875 క్లస్టర్లలో భారీ ఎల్‌ఈడి స్క్రీన్ల ద్వారా నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.ఈసారి మహానాడుకు “స్త్రీ శక్తి” ప్రధాన థీమ్‌గా నిర్ణయించారు. మహిళా సంక్షేమం, మహిళల సాధికారత కోసం తెలుగుదేశం పార్టీ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగనుంది. అలాగే “కార్యకర్తే పార్టీకి అసలైన అధినేత” అనే సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరవేయనున్నారు.తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మహానాడుకు రెండు రోజుల ముందుగానే ప్రతి ఇంటిపై టీడీపీ జెండాలు ఎగురవేసి, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి ఈ మహా వేడుకను పండుగలా నిర్వహించాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *