ఇంటింటికి మోడీ ఫిట్నెస్ మంత్ర- యోగ శక్తి సాధన సమితి
1 min read
విజయవాడ , న్యూస్ నేడు: నగరంలోని యోగ శక్తి సాధన సమితి భారతదేశ వ్యాప్తంగా ‘ఇంటింటికి మోడీ ఫిట్నెస్ మంత్ర’ ను అందించాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.దేశంలో రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు,సర్జరీలు అర్ధంతర చావులు తగ్గించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫిట్నెస్ మంత్రతో సాధ్యమే అన్నారు.యోగ,ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలను అనేక సంవత్సరాలుగా ప్రజలకు అవగాహన,చికిత్స, శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్న కోర్సు డైరెక్టర్ మాకాల సత్యనారాయణ ద్వారా’ఇంటింటికి మోడీ ఫిట్నెస్ మంత్ర ‘అంతర్జాతీయ యోగ దినోత్సవాలు 2025 లో భాగంగా జూన్ ఒకటో తారీకు నుండి 21వ తేదీ వరకు కార్యక్రమాల బ్రోచర్ రిలీజ్ చేయటం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీప్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం టీ కృష్ణబాబు వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ యోగ విధానాలను అలపర్చుకోవలసినదిగా కృష్ణ బాబు ఆకాంక్షించారు. స్వచ్ఛంద సంస్థలు,యోగ, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్,మర్మా,ఆయుర్వేద సిద్ధ వైద్యులు అనేక ఇతర ఆరోగ్య విధానాలలో పని చేసేవారు మోడీ ఫిట్నెస్ మంత్ర విధానాలను ప్రచారం చేయటం వారి వారి ఆరోగ్య విధానాలకు జత కలుపుకోవడం ద్వారా మరింత త్వరగా ఫలితాలు అంది వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమాలలో పాల్గొన గోరు వారు సెల్ నెంబర్ 9 0 0 0 3 4 7 3 6 9 నకు సంప్రదించవలసినదిగా యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ కోరుచున్నారు.