200 రోజుల పని దినాలు కల్పించాలి
1 min read
పల్లెల్లో డ్రైనేజీల దుర్వాసన
-ఏపీవోకు సీపీఎం వినతి..
నందికొట్కూరు న్యూస్ నేడు:ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఉపాధి పనులు కల్పించాలని గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలని నాగేశ్వరరావు అన్నారు. వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధి కూలీలకు వెంటనే ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరుతూఏపీఓ మంగమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో వేసిన మొక్కజొన్న, మినుము,సోయాబీన్,పత్తి, తదితర పంటలు దెబ్బతిన్నాయని వాటి మూలంగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లేక వలసలు వెళ్తు న్నారని వీటి వల్ల పని దినాలు పెంచాలనిపెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పనుల దగ్గర కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు, కొణిదల, వడ్డమాను,బిజినవేముల, గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి నాగటూరులో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో డ్రైనేజీ కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్ల విపరీతమైన దుర్వాసన వస్తుందని వీటి వల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని అధికారుల స్పందించి వెంటనే డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాలకృష్ణ,పక్కిర్ సాహెబ్, కర్ణ,ఉస్మాన్ భాష,బెస్తరాజు పాల్గొన్నారు.


