నగరపాలక సంస్థ సీనియర్ అసిస్టెంట్ యం.డి ఉప్రాన్ పదవీ విరమణ
1 min read
ప్రావిడెంట్ ఫండ్ రూ:2,14,000/-లు చెక్కును అందించిన మేయర్ నూర్జహాన్ పెదబాబు
ప్రతి ఒక్క ఉద్యోగిని అన్ని విదాలుగా ఆదుకుంటాం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదవి విరమణ చేసినఎండీ ఉఫ్రాన్ కు చెందిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం నగదు 2 లక్షల 14 వేల రూపాయల చెక్కును నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మంగళవారం అతనికి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. నగరపాలక సంస్థలో ఎన్నో విశేషమైన సేవలు అందించిన ఎండి ఉఫ్రాన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదవీ విరమణ చెందిన వెంటనే అతనికి మున్సిపల్ కార్యాలయం నుండి అందవలసిన పూర్తి మొత్తాన్ని అందజేయడం జరిగింది. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి అన్ని విధాలుగా ఆదరిస్తామని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏ.భాను ప్రతాప్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.