ఎద్దుల పోటీల్లో..విజేత పెద్ద కొట్టాల
1 min read
పోటీలను ప్రారంభించిన మున్సిపాలిటీ చైర్మన్..పట్టణ సీఐ
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రహదారిలో ఉన్న జీవన్ జ్యోతి పాఠశాల దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణోత్సవ మహోత్సవం మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీల్లో మొదటి విజేతగా పెద్దకోట్టాల బోరెడ్డి కేశవరెడ్డి వృషబాలు మొదటి స్థానంలో నుంచి 60 వేలు సంపాదించాయి.2వ స్థానంలో శనిగ పల్లె చక్రవర్తి గౌడ్, మరియు రేమట నడిపి గిడ్డయ్య,3వ స్థానంలో హెచ్ కైరవాడి లక్ష్మన్న,4వ స్థానంలో ఎన్ కొత్తపల్లి చల్లా వెంకట హారతి వృషభాలు గెలుపొందాయి.గెలుపొందిన యజమానులకు దాతలు నగదును అందజేశారు.బుధవారం ఉదయంనందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మరియు పట్టణ సీఐ వై ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఎద్దుల యజమానులను శాలువా,మెమెంటోళ్ళతో మున్సిపాలిటీ చైర్మన్ మరియు సీఐ ఘనంగా సత్కరించారు.ఈ పోటీల్లో మొత్తం 14 జట్లు పాల్గొన్నాయని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఉత్సాహభరితంగా హోరా హోరీగా పోటీలు జరిగాయి. ఎద్దుల పందాలను తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం తొమ్మిది బహుమతులకు 60 వేల నుంచి 5 వేల వరకు ఉన్నాయి.ఈరోజు గురువారం ఉదయం అంతర్రాష్ట్ర ఆరుపళ్ల ఎద్దుల బండ లాగుడు పోటీలు ప్రారంభం అవుతాయని ఈ పోటీల్లో మొత్తం 8 బహుమతులు ఉన్నాయి.40 వేల నుంచి 5 వేల వరకు ఉన్నాయని కమిటీ నిర్వాహకులు పాత్రికేయులతో అన్నారు.
