అవినీతి మయంగా నందికొట్కూర్ మున్సిపాలిటీ
1 min read
ఎక్కడ చూసినా అవినీతి
పర్సంటేజీల కోసం టిడిపి నేతల పాకులాటలు
పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ సుధీర్..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ అవినీతిమయంగా మారిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతుందని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలు పర్సెంటేజీల కోసం పాకులాడుతున్నారని కమిషన్ల కోసంమున్సిపాలిటీలో ఇద్దరు నేతలను పెట్టారని మైనారిటీలకు కోసం 90 శాతం పూర్తిచేసిన షాదిఖానాను ఎందుకు ప్రారంభించడం లేదన్నారు. పట్టణంలో కేజీ రోడ్డు మధ్యలో డివైడర్లు మరియు లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు అయి సంవత్సరం గడిచినా ఇంతవరకు ఈ పనులు ప్రారంభం కాలేదన్నారు.నేతలు అభివృద్ధి వైపు దృష్టిసాదించాలని పట్టణంలో డంపింగ్ యార్డ్ వల్ల వాటి దుర్వాసన రావడంతో పట్టణ ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.వర్గ పోరుతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని ఏబీఎం పాలెంలో దళిత కాలనిలో మరుగుదొడ్లు చాలా అద్వన్నంగా ఉన్నా ఎమ్మెల్యే ఎందుకు పాటించుకోవడం లేదు..దళితులంటే అంత చిన్న చూపా ప్రజల పక్షాన పోరాడుతామని డాక్టర్ సుధీర్ అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

