నందికొట్కూర్ ను..నందనవనంగా తీర్చిదిద్దుతా…
1 min read
కలసికట్టుగా సమస్యలను పరిష్కరించుకుందాం
పురపాలక సమావేశంలో ఎమ్మెల్యే..
పోలీసుల బందోబస్త్ నడుమ పురపాలక సమావేశం..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రానున్న రోజుల్లో నందికొట్కూరు పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జై కిసాన్ పార్కులో పురపాలక సంఘ సమావేశం మంగళవారం ఉ11 గంటలకు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది.2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ నేను ప్రతి సమావేశంలో చెబుతూనే ఉన్నా వార్డులో వధశాల ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీటిని వేరే చోటికి మార్చాలని ఎమ్మెల్యేను కోరారు.వధశాలకు వేరేచోట ప్రభుత్వ స్థలం 30 సెంట్లు ఉంటే వధశాలకు ఇవ్వాలని తహసిల్దార్ శ్రీనివాసులును ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉంది జీఎల్ ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించాలని కౌన్సిలర్ జాకీర్ అన్నారు.కుక్కల బెడద ఎక్కువగా ఉందని కుక్కల కోసం 5 లక్షలు ఖర్చు చేశారని ఎక్కడెక్కడ ఖర్చు చేశారని మున్సిపాలిటీ కమిషనర్ బేబీని కౌన్సిలర్అబ్దుల్ రవూఫ్ ప్రశ్నించారు. అదేవిధంగా గత రెండు నెలలుగా కౌన్సిల్ సమావేశం ఎందుకు పెట్టలేదని,ట్రాన్స్ ఫార్మర్లకు కంచెలు లేవు ఏమైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యులని ఆయన అడిగారు.రాబోయే రోజుల్లో నందికొట్కూరు పట్టణానికి మంచి శుభవార్త వస్తుందని మార్కెట్ కమిటీ నుండి ఆత్మకూరు రోడ్డు జమ్మిచెట్టు వరకు డివైడర్ లైటింగ్ కొరకు త్వరలోనే మంజూరు అవుతాయని పట్టణాన్ని నందనవనం చేస్తానని పట్టణం ప్రజలకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో పట్టణంలో తీసుకు వెళ్తున్న పైపులైన్ పనులను ఊరి బయటనే తీసుకువెళ్లాలని నేను అధికారులను ఆదేశించానని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.పట్టణ అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా సమస్యల్ని పరిష్కరించు కుందామని ఆయన అన్నారు. తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 595లో చాలా సంవత్సరాలుగా ప్రజలు జీవిస్తున్నారని వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు.ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగికి ఏ విధంగా ఇంటి పట్టా ఇస్తారని అధికారులను ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు.పలు సమస్యల గురించి మీరు ఏమీ పట్టించుకోవడం లేదంటే మున్సిపాలిటీ అధికారులపై మున్సిపాలిటీ చైర్మన్ నిప్పులు చెరిగారు.సీఐలు టి. సుబ్రహ్మణ్యం,వై ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ, కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.