NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు

1 min read

ఆందోళనలో 400 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగులు

నాలుగవ రోజు కొనసాగిన రిలే నిరావధిక దీక్ష

న్యాయమైన డిమాండ్స్ కోసం ధర్నా

మద్దతు పలికిన ఏపీ ఎన్జీవోస్, జేఏసీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి

చోడగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు,సంఘ నాయకులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :  ఏలూరు కలెక్టరేట్ వద్ద. గత నాలుగు రోజుల నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ లో 2017 లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నిధుల తో BSc నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 400 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎం ఎల్ హెచ్ పి/ సి హెచ్ ఓ లుగా పనిచేస్తూ వారికి రావల్సిన న్యాయమైన డిమాండ్స్ కోసం ధర్నా నిర్వహిస్తున్నారు.ఎం.ఎల్.హెచ్.పి జిల్లా నాయకత్వం నిన్నటి రోజు ఏపీ ఎన్జీజీజీవోస్  అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష,కార్యదర్సులు ని కల్సి మా డిమాండ్స్ కోసం చేస్తున్న ధర్నా కి మద్దతు కోరారు. ఆ సందర్భంగా గురువారం వారు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ మరియు జె ఏ సి పక్షాన మద్దతు తెలిపిన జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్,కార్యదర్శి నెరుసు రామారావు,ధర్నాని ఉద్దేశించి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎం ఎల్ హెచ్ పి ల సర్వీసు గ్రామాల్లో చాలా విలువైందని.వారికి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి..జీతాలు పెంచాలని.గతంలో ఇన్సెంటివ్స్ ఇచ్చేవారని,23 శాతం జీతం ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న వారికి ఇచ్చారు గాని,ఎం ఎల్ హెచ్ పిలకు ఇవ్వడం లేదని,ముఖ ఆధారిత హాజరు కి ఫీల్డ్ లో ఉన్న వారికి టూర్ ఆప్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యదర్శి రామారావు మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్స్ తో సమానంగా ఒక్క సర్జరీ మినహాయించి అన్ని మెడికల్ డ్యూటీలు చేస్తూ విశిష్ట సేవలు అందిస్తూ మెరుగైన జీతం ఎన్ హెచ్ ఎంలో పనిచేస్తూ.సరైన గుర్తింపు ఎం ఎల్ హెచ్ పి/సిహెచ్ఓ లకు లేదని వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహధ్యక్షుడు నోరి శ్రీనివాస్,ఏలూరు తాలుకా కార్యదర్శి కప్పల సత్యనారాయణ,ఎన్జీవో సంఘ నాయకులు వి.గంగాధర్.కె ఎస్ ఆర్ మోహన్, హరినారాయణ,ఎండి బెగ్, లేగల వెంకటేష్,ఎం ఎల్ హెచ్ పి అసోసియేషన్ నాయకులు సురేంద్ర,నరేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *