ఘనంగా భాష్యం స్కూల్లో నేషనల్ స్పోర్ట్స్ డే
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు స్థానిక ఎన్ ఆర్ పేట భాష్యం స్కూల్లో నేషనల్ స్పోర్ట్స్ డే ని ఘనంగా నిర్వహించారు.ఈ స్పోర్ట్స్ డే కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయలసీమ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కే శివ కుమార్ భాష్యం ఒలంపస్ లోగోని ఆవిష్కరించారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ , భాష్యం వైస్ చైర్మన్ హనుమంతరావు మరియు మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా స్పోర్ట్స్ డేని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాష్యం రాయలసీమ జోనల్ ఇంచార్జ్ అయిన అనిల్ కుమార్ కూడా ఈ స్పోర్ట్స్ డే లో పాల్గొని పిల్లలకి చదువుతోపాటు స్పోర్ట్స్ కూడా చాలా అవసరమని స్పోర్ట్స్ వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెప్పారు. అలాగే ఈ స్పోర్ట్స్ డే లో ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్, హెచ్ఎం మాధవి పిఈటిస్ కిరణ్ కుమార్, రవి అలానే ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

