పెన్సిల్ వినాయకుడి చిత్రం….
1 min read

చిత్ర లేఖనంలో విద్యార్థిని ప్రియ ప్రతిభ
మంత్రాలయం, న్యూస్ నేడు : వినాయక చవితి సందర్భంగా స్థానిక శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ముకుంద ప్రియ చిత్రలేఖనంలో తనకు సాటిలేరు అంటూ వినాయకుని చిత్రాన్ని పెన్సిల్ తో వేసి తన ప్రతిభను చూపింది. శుక్రవారం వినాయకుని నిమజ్జనం సందర్భంగా స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సుజిత మల్లికార్జున కూతురు వడ్డే నారాయణ మనవరాలు ముకుంద ప్రియ గణపతి చిత్రం వేసి వావ్ అనిపించింది. గతంలో కూడా సూక్ష్మ కళాకారిణిగా చెస్ బోర్డు, ఇస్ర్రో రాకెట్ ను చాకపీస్ ల పై వేసి ప్రతిభ చూపిన ముకుంద ప్రియ అర్ధనారీశ్వరులు, శివ పార్వతులు, రాఘవేంద్రస్వామి చిత్రం, దసరా పండుగ సందర్భంగా అమ్మవారి రూపం, ఆంజనేయ స్వామి మూర్తిని వేశారు. ప్రస్తుతం వినాయకుని చిత్రం వేసి చిత్రలేఖనంలో సాటిలేని విద్యార్థిగా గుర్తింపు పొందడంతో పాఠశాల కరస్పాండెంట్ గంగాధర్ రెడ్డి ప్రిన్సిపాల్ ఎస్ రాఘవేంద్ర ప్రధానోపాధ్యాయురాలు అశ్విని ఇతర ఉపాద్యాయినీ ఉపాధ్యాయులు అభినందించారు.

