NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పౌర సరఫరాల గొడం పాయింట్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

1 min read

ఆదోని, న్యూస్​ నేడు:   ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ గారు శుక్రవారం ఆదోని పట్టణం లోని  పౌర సరఫరాల గొడం పాయింట్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారు గొదంలో ఉన్న రేషన్ నిల్వలు, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ…రేషన్ బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా, పూర్తిస్థాయి పారదర్శకతతో వ్యవహరించాలని సంబంధిత రెవెన్యూ అధికారులు కృషి చేయాలి. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా, సమయానికి రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలి  అని స్పష్టం చేశారు.   ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్, ఉప తహశీల్దారు రవీంద్ర రెడ్డి, పౌరసరఫరాల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author