NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింతలపూడి ఏరియా హాస్పిటల్ కు నూతన గైనకాలజిస్ట్

1 min read

శాసన సభ్యుల చొరవతో  నూతన గైనకాలజిస్ట్ రాక

ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన గైనర్జిస్ట్ డాక్టర్:హర్షిత

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి:ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఏలూరు, న్యూస్​ నేడు:  చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నియామకమైన గైనకాలజిస్ట్ డాక్టర్:వల్లూరి హర్షిత  ఈరోజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.శాసనసభ్యులు రోషన్ కుమార్  మాట్లాడుతూఅంకితభావంతో పనిచేసే వైద్యులకు ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా సకాలంలో వైద్యం అందించి, ఎరుగైన సేవలు అందించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోండ్రు దేవా,గుమ్మిశెట్టి భారతి పాల్గొన్నారు.

About Author