NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బంగారు కుటుంబాలు అనుసంధానం త్వరితగతిన పూర్తిచేయాలి

1 min read

ప్రభుత్వ  సేవలు పట్ల ప్రజలు సంతృప్తి స్థాయి పెంచాలి

ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్లతో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్

ఏలూరు నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లాలో పీ4 కార్యక్రమంలో ఇంతవరకు 51,192 బంగారు కుటుంబాలతో 6,654 మంది మార్గదర్సులు అనుసంధానించామని  జిల్లా కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కి తెలిపారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుండి పీ4 కార్యక్రమం, ప్రభుత్వ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయి, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, అన్నాక్యాంటీన్ల నిర్వహణ,తదితర అంశాలపై  వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్  సమీక్షించారు.ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా జాయింటు కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఇతర జిల్లా అధికారులతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎస్ కె.విజయానంద్ మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో మార్గదర్సులతో బంగారు కుటుంబాలు అనుసంధానం త్వరితగతిన పూర్తిచేయాలని, మార్గదర్సకులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా వారికి వారే స్వచ్చందంగా పీ4 కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు పట్ల ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా పనిచేయాలన్నారు. అన్నా కేంటీన్ల ను నిర్దేశించిన సమయంలో తెరిచి నాణ్యమైన ఆహరం అందించడంతో పాటు,అన్నా క్యాంటీన్ల ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలూ, పట్టణాలలో సంపూర్ణ పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ బంగారు కుటుంబాలు ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలపై బేసిక్ నీడ్ సర్వే  పూర్తిచేశామని అన్నారు. మార్గదర్సులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్చందంగా పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు.  ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పనులను వేగవంతం చేస్తున్నామని, ఇప్పటికే చింతలపూడి నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుచేయడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ సేవల పట్ల ప్రజలలో సంతృప్తి స్థాయి మరింత  పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అన్నా కేంటీన్ల  నిర్వహణలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూస్తున్నామన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు,సిపివో సి.హెచ్. వాసుదేవరావు,జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డిపిఓ కె.అనురాధ, డిఎంహెచ్ఓ డా. పి.జె.అమృతం, జిల్లా పరిశ్రమల అధికారి పి సుబ్రహ్మణ్యేశ్వర రావు,సర్వ శిక్ష అభియాన్ ఏపిసి డా.కె పంకజ్ కుమార్, మత్స్య శాఖ డిడి బి.నర్సయ్య, పశుసంవర్ధక శాఖ డిడి డా.గోవిందరాజు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author