NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాయమ్మ అవ్వ  విగ్రహ  ప్రతి స్థాపన

1 min read

ప్రారంభించిన వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి

దేవాలయానికి రూ 50 వేలు విరాళం

మంత్రాలయం, న్యూస్​ నేడ్​:  మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ తాయమ్మ అవ్వ దేవాలయం లో విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమంలో వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు . ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి ని వైకాపా సీనియర్ నాయకులు అడ్వకేట్ గురురాజ రావు, సర్పంచ్ సీతారామి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం తాయమ్మ అవ్వ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వై. ప్రదీప్ రెడ్డి  ఆలయ కమిటీ సభ్యులకు రూ 50 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాలపల్లి  గుండాల ఈరన్న, గుండాల ముత్తన్న, గుజ్జల భీమసేన, బోయ నరసింహులు, కురువ బీరప్ప, బైటిగేరి వీరేష్,బోయ తిరుమల,గుండాల రోగన్న, సజ్జల రామకృష్ణ, శాంతి భూషణ్ రెడ్డి, శరత్ చంద్ర ప్రకాష్, వడ్డే సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author