ప్యాపిలి అభివృద్ధికి మరో అడుగు.. మారనున్న రోడ్ల రూపురేఖలు!
1 min read
రూ.30 లక్షల పనులకు ఎమ్మెల్యే కోట్ల భూమిపూజ
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, బత్తుల రామేష్ రెడ్డి, గడ్డం అంకిరెడ్డి, డోన్ మార్కెట్ యార్డు చైర్మన్ రాజా రేణుక, రాజా నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మండల కన్వీనర్ సుదర్శన్, బట్ట సత్యనారాయణ, రాజశేఖర్, ఖాజా ఫీర్, గోల్ల రామ్మోహన్ యాదవ్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, జనరల్ సెక్రటరీ నడిగడ్డ నాగేంద్ర, ఆర్ఈ నాగరాజు, ఎస్.కె. వలి, గూండాల చంద్రశేఖర్, సివిలి రంగన్న, రాజు, బాలకృష్ణ, జనసేన నాయకులు క్రిట్టిపాడు చంద్ర, వెంకటేష్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


