NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్య వివాహాలు వద్దు..చదువే ముద్దు : సీడీపీఓ

1 min read

కస్తూర్బా బాలికలకు అవగాహన..

నందికొట్కూరు, న్యూస్ నేడు: బాల్య వివాహాలు వద్దు..చదువే ముద్దు అని నందికొట్కూరు అంగన్వాడి సిడిపిఓ మంగవల్లి అన్నారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో అంగన్వాడీ సూపర్వైజర్ అనురాధ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు చేస్తే కలిగే నష్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్యా రక్షణ ఆరోగ్యం  మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సహకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చిన్న వయస్సులోనే వారి కళలను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిని చట్టం కఠినమైన శిక్షలు విధిస్తుందని తెలియజేశారు. మీకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని ఒక లక్ష్యంతో మీరు ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారని ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు. తర్వాత ప్రాంగణంలో బాలికలు మానవహారంగా ఏర్పడి బాల్య వివాహాల గురించి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author