తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్
1 min read
-డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.చంద్రశేఖర్
న్యూస్ నేడు, విజయవాడ 28:ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఔన్నత్యాన్ని శిఖరాగ్రానికి చేర్చడంలో దివంగత నందమూరి తారక రామారావు పోషించిన పాత్ర అమోఘమని డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.చంద్రశేఖర్ కొనియాడారు. స్వర్గీయ ఎన్టీరామారావు 102 వ జయంతి సందర్బంగా విజయవాడలోని యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను ఎన్ని తరాలు గడిచినా మరిచిపోలేమని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ అభివృద్ధికి ఎన్టీఆర్ పునాది వేశారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ మానస పుత్రికగా డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్యలో అగ్రగామిగా నిలిచిందని డా. చంద్రశేఖర్ అన్నారు. మహనీయుడు, దివంగత నేత నందమూరి తారక రామారావు ఎందరికో ఆదర్శంగా.. స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఈ సందర్భంగా వీసీ డా. చంద్ర శేఖర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
