NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదర్శప్రాయుడు ఎన్టీఆర్‌…

1 min read

నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు

కర్నూలు, న్యూస్ ​నేడు:  బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి క్రీ.శ్రే. నందమూరి తారక రామారావు నేటి తరానికి ఆదర్శప్రాయుడని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని నగరపాలక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గూడు, కూడు, గుడ్డ అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. పేదలకు 2 రూపాయలకే బియ్యం, తాలుకా వ్యవస్థ నుండి మండల వ్యవస్థ రూపకల్పన, మహిళలకు సమాన ఆస్తి వాటా హక్కు వంటి గొప్ప సంస్కరణలకు నాంది పలికారని కొనియాడారు. చిన్న గ్రామంలో జన్మించి, దేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందారని, చరిత్రలో నిలిచిపోయేలా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీరంతా మద్రాసు వెళ్ళకుండా స్థానిక ఆంధ్ర ప్రాంతానికి తాగునీటి అందించేందుకు కృషి చేసిన మహనీయులు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాజకీయ, సినిమా రంగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారని, క్రమంతప్పకుండా సమయపాలన పాటించేవారని, నేటి సమాజం ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని కమిషనర్ తెలిపారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు రామక్రిష్ణ, స్వర్ణలత, మంజూర్ బాష, సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author