NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

1 min read

ఆదోని, న్యూస్​ నేడు:  ఎన్టీఆర్ పేదలకు పెన్షన్ పంపిణీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆదోని మండలం బైచిగెరి గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ  పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు పారదర్శకంగా చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, పెన్షన్ పథకాలు అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని ఆమె తెలిపారు. గ్రామ ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బెస్త ఓంకార్ , ఎక్స్ ఎంపీపీ మురళి, సాదిక్ వలి, చిన్న స్వామి,వెంకటేష్, దస్తగిరి,నరసప్ప,తిక్కస్వామి, ఆంజనేయులు,అశోక్, అంజి, ఖాసిం, రాజు, బాబురావు,కుప్పగల్ హనుమంతు,దేవేంద్ర, భాస్కర్,విజయ్,సూరి, లక్ష్మన్న ,మరియు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *