NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్, కర్నూలు ను ఆకస్మికంగా తనిఖీ

1 min read

తనిఖీ చేసిన కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి   జి. కబర్థి సూచనల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  ఈ రోజు అనగా 17-04-2026 న కర్నూలు నందు గల అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ ను తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి పిల్లలకు అందిస్తున్న ఆహారం,వసతి సదుపాయాలను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న   పిల్లలకు ఎవరికైనా   న్యాయ వాది లేకుంటే ఉచిత న్యాయ వాదిని నియమించి వారి కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చట్టంతో వివేదించబడిన బాలలకు సంబందించిన చట్టాలను, ఉచిత న్యాయ సహాయమును గురించి తెలియజేశారు.  పిల్లలు లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయంను పొందుటకు అర్హులని తెలిపారు. అనంతరం ఆ కాంపౌండ్ లోనే గల జువెనైల్ జస్టిస్ బోర్డు ఆఫీస్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు పిల్లల పట్ల తీసుకుంటున్న చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జువెనైల్  జస్టిస్ బోర్డు  ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అపర్ణ, లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది నాగప్ప, అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుస్సేన్ బాష, డీపీవో దివాకర్, సిడబ్ల్యూసీ చైర్మన్ జుబేదాబేగం మరియు మెంబెర్స్ ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *