(దిశ) కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చెయ్యాలి
1 min read
జిల్లా జాయింటు కలెక్టరు డా:యం.జె.అభిషేక్ గౌడ్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా జాయింటు కలెక్టరు సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అభివృద్ధి, సమన్వయ కమిటీ (దిశ) కార్యక్రమం ముందస్తు కార్యక్రమ ఏర్పాట్లుపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ బుధవారం జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో జరగనున్న జిల్లా అభివృద్ధి, సమన్వయ కమిటీ (దిశ) సమావేశానికి వివిధ శాఖలు అధికారులు ముందస్తు పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గత దిశలో జరిగిన వివిధ అంశాలు, తీసుకున్న చర్యలు,రేపు జగనున్న సమావేశంలో చర్చించే అంశాలు మీద శాఖలు వారీగా జిల్లా జాయింటు కలెక్టరు సుదీర్ఘంగా సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో జిల్లాలో చేపడుతున్నవివిధ ప్రాజెక్టు పనులు పురోగతిని ప్రజా ప్రతినిధులకు అధికారులు చక్కగా వివరించాలని తెలిపారు. శాఖలు వారీగా పూర్తిస్థాయిలో నివేదికలను ఈ సాయంత్రానికి అందజేయ్యాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టర్ యం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఈనెల (రేపు) 24వ తేదీ జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో జరగనున్న జిల్లా అభివృద్ధి, సమన్వయ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించుటకు అన్ని శాఖలు అధికారులతో ముందస్తు ఏర్పాట్లుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. గత దిశ సమావేశంలో తీసుకున్న అంశాలు, తీసుకున్న చర్యలు, క్రొత్తగా ప్రతిపాదించిన అంశాలను పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసుకుని సమావేశానికి హాజరు కావాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ కమిటీ (దిశ)సమావేశం పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసన మండల సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ఇంచార్జి డిఆర్వో ఎల్.దేవకీదేవి, జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న , వివిధ శాఖలు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


