NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా అభివృద్ధి నిర్మాణ పనులలో అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలి

1 min read

ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చి దిద్దాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

జిల్లాలో గంజాయి,సారా,బెల్ట్ షాప్స్ అరికట్టేవిధంగా చర్యలు చేపట్టాలి

వేసవిదృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకూడదు

చేపట్టిన పనుల్లో  నాణ్యత ప్రమాణాలు పాటించాలి

సమావేశాలకు హాజరుకాని అధికారులుపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సిఈవో కి జెడ్పీ చైర్ పర్సన్ ఆదేశాలు జారీ

ఉభయ జిల్లాలు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

ఏలూరు, న్యూస్​ నేడు  : ఉభయ జిల్లాలో అభివృద్ధిలో  కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో గురువారం స్థాయీ సంఘ సమావేశాలను జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, ఉభయ జిల్లాలు అధికారులు, జిల్లా పరిషత్తు సభ్యులతో కలసి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ 1వ7వ స్థాయి సంఘాలు సమస్యలు, రెండవ విడతగా 2,3,4,5,6 స్థాయి సంఘాలు సమస్యలుపై సమీక్షంచారు. మొదటిగా వివిధ శాఖల అధికారులు జిల్లాలో మండలాలు వారీగా మంజూరైన పనులు, ప్రగతిలో పనులు వాటి వివరాలు, ఇంకా జరగవలసి ఉన్న పనులు వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించుటకు అందరు సహకారంతో ముందుకు సాగుతున్నామని, అధికారలు పాత్ర కీలకమైనదన్నారు. జిల్లాలో మంజూరైన కొన్ని పనులు పూర్తిచేయని కారణంగా ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.   ఉమ్మడి జిల్లాలో పౌరసరఫరాలు ద్వారా అమలు చేస్తున్న రేషన్ పంపిణీ, రైసు కార్డ్స్, ధాన్యం కొనుగోలు వంటి అంశాలుపై సమీక్షించారు. ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చి దిద్దాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగా శానిటేషన్, మురుగునీరు పారుదల అయ్యేలా డ్రైనేజిలను శుభ్రం చేయడం, త్రాగునీటి సమస్యలను పక్కాగా పరిష్కరించాలన్నారు. ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తూ జిల్లా పరిషత్ పరిధిలో గల ఉభయ గోదావరి జిల్లాలో  గంజాయి, సారా, బెల్ట్ షాప్స్ అరికట్టేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్  క్రింద జిల్లా పరిషత్తు ద్వారా చేపట్టిన రహదారులు అభివృద్ధిలో భాగంగా 2024-25 సంవత్సరంలో 1576 పనులకు గాను 1419 పనులు పూర్తి చేసి 202 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. 2025-26 లో 1360 పనులకు గాను 561 పనులు పూర్తి చేసి 209 కిలోమీటర్ల రహదారులు పూర్తి చేయడం   జరిగిందని పంచాయతీరాజ్ అధికారి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కు వివరించారు. డిఆర్డిఏ  ద్వారా ఎన్టీఆర్ పెన్షన్స్ భరోసా, ఎస్ హెచ్ జి  గ్రూపులకు బ్యాంకు రుణాలు, స్త్రీనిధి వంటి అంశాలుపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో డ్వామా ద్వారా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, జలహారతి పై సమీక్షించారు.  వేసవి దృష్ట్యా జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ప్రతి గ్రామంలో చెరువులు నింపడం, బోర్లు రిపేర్లు చేయటం వంటి ప్రక్రియను వేగవంతం చేసి పక్కా ప్రణాళికతో త్రాగు నీటిని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ పంచాయితీ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తూ గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహ నిర్మాణాల్లో పూర్తి చెయ్యాలని అన్నారు. అదే విధంగా  ఇళ్లస్థలాలు కొరకు  కొత్తగా దరఖాస్తు చేసిన వారి దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్మిక శాఖ ద్వారా అమలు చేస్తున్న వివాహ కానుక పథకం, ప్రసూతి ప్రయోజనా పథకం, సహజ మరణ ఉపశమన పథకం, అంత్యక్రియలు సహాయ పథకాలు ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్న  ప్రయోజనాలను అసిస్టెంటు లేబరు కమీషనరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కు వివరించారు. పరిశ్రమలు శాఖ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని, ఆ దిశగా వారికి బ్యాంకులు రుణ సౌకర్యంతో పాటు 45 శాతం రాయితీని ప్రభుత్వం కల్పిస్తుందని పరిశ్రమలు శాఖ అధికారి వివరించారు. వ్యవసాయ, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం శాఖలు ద్వారా అమలు చేస్తూ లబ్ధిదారులకు అందిస్తున్న  ప్రభుత్వ పథకాలు లక్ష్యసాధన  వివరాలను జడ్పీ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, మొడియం రామ తులసి, పెనుముల విజయబాబులు స్థాయి సంఘాలు సమావేశంలో పథకాలు పురోగతిపై సమీక్షిస్తూ పెండింగులో ఉన్న  పనులను వేగవంతం చెయ్యాలని అధికారులకు సూచించారు.జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశానికి  హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పరిషత్తు చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు.ఈ సమావేశంలో  జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, ఉభయ జిల్లాలు వివిధ శాఖలు అధికారులు,జిల్లా పరిషత్తు సభ్యులు,జిల్లా పరిషత్తు అధికారులు,ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *