NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివాహ వేడుకల్లో టిడిపి నాయకుల సందడి – నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువ

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో టిడిపి నాయకులు ఉత్సాహంగా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. హోళగుంద టిడిపి సీనియర్ నాయకులు బుడుగుజంగల్ రామన్జీ కుటుంబీకుల వివాహ కార్యక్రమాలతో పాటు కురవ పంపా కుమారుల వివాహ వేడుకలు, ముద్దట మాగి, మాలి వివాహ వేడుకలు, అలాగే RRG బసవన గౌడ్ మనవడు వివాహ వేడుకల్లో కూడా టిడిపి నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో మండల టిడిపి ప్రధాన కార్యదర్శి గోవింద గౌడ్ , మాజీ మండల కన్వినర్ వీరన్న గౌడ్ , మండల మైనార్టీ టిడిపి సెల్ అధ్యక్షుడు ముల్లా మోయిన్ , టిడిపి సీనియర్ నాయకులు దిడ్డి మల్లయ్య , యువ నాయకుడు పవన్ , సింధు వాలం మల్లికార్జున  వెంకటేష్  మలయ్య  తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు వధూవరులను ఆశీర్వదిస్తూ, వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వధూవరుల తల్లిదండ్రులు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి గోవింద గౌడ్ ని శాలువా కప్పి, పూలహారాలతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు బంధుమిత్రులతో కలిసి భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వివాహ వేడుకలు సంతోషభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *