రాయల్ రిఫా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విద్యార్థుల ప్రతిభకు ఘన సన్మానం
1 min read

5వ తరగతి ఫస్ట్ విద్యార్థికి అభినందనలు – 6వ తరగతి విద్యార్థులకు సన్మానం – ఈరోజు నుంచి సెలవులు ప్రారంభం
హోళగుందన్యూస్ నేడు : రాయల్ రిఫా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఈరోజు (24వ తేదీ) విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 5వ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.అలాగే, 6వ తరగతి విద్యార్థులను కూడా వారి ప్రతిభను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హబీబుల్లా మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు పటిష్టంగా ఉండాలంటే వారు మంచి విద్యను అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగాలని సూచించారు.అలాగే ఆయన తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఉపాధ్యాయులు అందిస్తున్న మార్గదర్శకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు సెలవుల సమయంలో కూడా సమయాన్ని వృథా చేయకుండా పాఠ్యాంశాలను పునర్విమర్శ చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జమాతే ఆలే హదీస్ అమీర్ ఎం.ఎం. సాదిక్ మాట్లాడుతూ, విద్య మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెడ్ మేడం నా హేదా , ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.అలాగే ఈరోజు నుంచి పాఠశాలకు వేసవి సెలవులు ప్రారంభమైనట్లు పాఠశాల నిర్వహణ వెల్లడించింది.


