NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ లక్ష్యాలను సాధించాలి

1 min read

రైతులకు అవగాహన కల్పించాలి

ఈ ఏడాది 14 వేల హెక్టార్లతో ఆయిల్ ఫామ్ విస్తీర్ణకు లక్ష్యం

ఉధ్యాన పంటల విస్తరణపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.  శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఉధ్యాన, మైక్రోఇరిగేషన్, ఫుడ్ ప్రోసెసింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మండలాల వారీగా ఆయిల్ ఫామ్ సాగుపై ఉధ్యానవన, వ్యవసాయ, విస్తరణ అధికారులతో చర్చించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2,80,814 ఎకరాల్లో ఉధ్యాన పంటలు సాగువుతుండగా అందులో 1,35,656 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతుందన్నారు. ఉధ్యాన పంటల విస్తరణలో భాగంగా 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 14 వేల హెక్టార్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కు లక్ష్యాన్ని నిర్ధేశించడం జరిగిందన్నారు.   ఈ విషయం ఆయా మండలాల వారీగా సంబంధిత ఉధ్యాన శాఖ అధికారులకు, సచివాలయ ఉధ్యాన అసిస్టెంట్లకు తెలియజేయాలన్నారు. దానికి అనుగుణంగా లక్ష్యాసాధనకు నెలలోపు మైక్రోప్లానింగ్ రూపొందించుకోవాలన్నారు.  ఆయిల్ ఫామ్ పంట సాగు పురోగతిపై వ్యవసాయ, సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణన చేయాలన్నారు.  ఆయిల్ ఫామ్ సాగుకు ఆసక్తి కనబరిచే రైతులను గుర్తించేందుకు ఆయా రైతు కుటుంబాలను సంప్రదించి పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. పంట వేసిన మొదటి నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం కల్పించే రాయితీలను రైతులకు అవగాహన పర్చాలన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు  సరఫరా, మొక్కలు నాటిన రైతుకు అందించే మొక్కల సరఫరాలో, ఇతర సబ్సిడీలు అందించడంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.  పంటకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం చర్యలు చేపట్టాలన్నారు. పొగాకు పంటసాగుకు ప్రత్యమ్నాయంగా ఇతర ఉధ్యాన పంటల సాగుపై రైతులను చైతన్యం పరచాలన్నారు. కొబ్బరిలో కోకో అంతర పంటను ఇతోధికంగా ప్రోత్సహించాలన్నారు. ఆయిల్ ఫామ్, ఇతర ఉధ్యాన పంటల సాగులో నూతన టెక్నాలజీ, సాగుకు సంబంధించిన అంశాలపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన పరిచి వారి సాగులో వారి అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ పంటసాగులో డ్రోన్ల వినియోగంపై వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  సమావేశంలో ఉధ్యానవన శాఖ డిడి ఎస్. రామ్మోహన్, మైక్రోఇరిగేషన్ పిడి పి. రవికుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సుబ్రహమణ్యేశ్వరరావు, ఎల్ డిఎం డి. నీలాధ్రి, పశుసంవర్ధక శాఖ జెడి గోవిందరాజులు, ఫుడ్ ప్రోసెసింగ్ సంస్ధ జోనల్ మేనేజర్ మారుతి, సాయి శ్రీనివాస్, ఆయిల్ ఫామ్ సంబంధించి గోద్రేజ్, నవభారత్, త్రిఎఫ్ ఆయిల్ ఫామ్ సంస్ధల ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతోపాటు ఉధ్యానవనశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *