పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తొలగించాలి
1 min readపల్లెవెలుగు వెబ్: పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావన తొలగించాల్సిన బాధ్యత ప్రొబేషనరీ ఐపీఎస్ లకు ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉన్నతాధికారులుగా మీరు చేసే ప్రతి పనిలో దేశమే ముందు, ఎప్పటికీ ముందు
అనే భావన ప్రతిబింబించాలని అన్నారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమిలో శిక్షణ పూర్తీ చేసుకున్న ప్రొబేషనరీ ఐపీఎస్ లను ఉద్దేశించి ప్రసంగించారు. అధికారులుగా మీరు తీసుకునే ప్రతినిర్ణయంలో జాతి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని తెలిపారు. పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావన దేశానికి అతిపెద్ద సవాల్ అని మోదీ అభిప్రాయపడ్డారు. కరోన సమయంలో పోలీసులు చేసిన సహాయం వల్ల ప్రజల్లో మంచి భావన ఏర్పడినప్పటికీ.. ప్రస్తుతం అది మొదటికి వచ్చిందన్నారు.