పారిజాత గిరి ప్రదక్షిణ,వేలాది సంఖ్యలో భక్తులు,కాలినడకన వెంకన్న దర్శనం
1 min read
భక్తులకు ఆలయ అన్నదాన మండపంలో ఉచిత అన్న ప్రసాద వితరణ
వివిధ సేవల ద్వారా మొత్తం 1,33,900/రూపాయలు ఆదాయం
ఈవో కలగర శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పారిజాత,గిరి ప్రదక్షిణ, వేలాది సంఖ్యలో కాలినడకన భక్తులు వెంకన్న దర్శనం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు ఏడుకొండలలో ఆరో కొండపై భారీగా వృక్షాలు వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువ్ జాబునే నాలుగు గంటల 30 నిమిషాలకు సుప్రభాత సేవ తోమాల సేవ ఆరాధన తీర్థప్రసాద్ గోష్టి అనంతరం భక్తులకి విశేషమైన అలంకరణలో శ్రీ స్వామి వారు దర్శనం కల్పించారు. అలాగే ఉదయం ఐదు గంటల నుండి ఆలయం గార్డెన్ లో భూవరస్వామి దర్శనం అనంతరం గిరి ప్రదర్శన మార్గంలో వేలాడ సంఖ్యలో భక్తులు విశేష సంఖ్యలో కాలినడకన గోవింద నామస్మరణలతో స్వామివారికొండ పైకి వచ్చిన భక్తులు కు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఆలయ కార్యనిర్వాహణధికారి భక్తులు విశేష సంఖ్యలో శ్రీ స్వామివారి అష్టోత్తర పూజలు శ్రీ స్వామివారికి మొక్కుబడులు సమర్పించారు, జంగారెడ్డిగూడెం నగర కమిషనర్ వి.వెంకటరమణ మరియు జంగారెడ్డిగూడెం బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎఎంవిఐ రవి గోపాల్ కుటుంబం సభ్యులు తో శ్రీస్వామివారి దర్శించికున్నారు. ఆలయమర్యాదలతో శ్రీస్వామివారి శేషా వస్త్రాలు, ప్రసాదాలు వేద ఆశీస్సులుతో సన్మానం చేసారని ఈవో తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ అన్నదాన మండపంలో ఉచిత అన్న ప్రసాద వితరణ జరిపించారు. ఈరోజు ఉభయదారులుగా విపికె సత్యనారాయణ రాజు, సుశ్చలాదేవి, జంగారెడ్డిగూడెం, కనక రమేష్ , అరుణ జ్యోతి,రెడ్డి వాస్తవ్యులు విశేష సంఖ్యలో వచ్చిన భక్తులకి దాతలు సహకారంతో అన్నదానం జరిపించిన వారికి శ్రీ స్వామివారి సేవాస్త్రాలు శ్రీ స్వామివారి ప్రసాదాలు వేద పండితుల ఆశీస్సులతోసన్మానంఆలయప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు చేసినారు.ఆలయ ఆదాయం పూజ టికెట్ ద్వారా, ప్రసాదాలు, విరాళాలు ద్వారా, అన్నదానం వివిధ సేవల ద్వారా మొత్తం 1,33,900/రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు.


