NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింతలపూడిలో బస్సు టైమింగ్ బోర్డులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

1 min read

వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా చింతలపూడిలో బస్సు టైమింగ్ బోర్డులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు ఏ సమయంలో వస్తుందో తెలియక విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి బస్ స్టాప్‌ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.గతంలో మాదిరిగా పాత బస్ స్టాండ్, జీబీజీ రోడ్ బస్ స్టాప్, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న బస్ స్టాప్, ఫైర్ స్టేషన్ సెంటర్ సమీప బస్ స్టాప్ వంటి ప్రధాన ప్రాంతాల్లో బస్సుల రాకపోకల సమయాలను తెలిపే టైమింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.ప్రస్తుతం బస్సు టైమింగ్ తెలుసుకోవాలంటే కొత్త బస్ స్టాండ్‌కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన టైమ్ షీట్‌ను చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రధాన బస్ స్టాప్‌ల వద్ద బస్సు టైమింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని వారు అధికారులను కోరుతున్నారు.

About Author