పదిలో మెరిసిన పత్తికొండ విద్యార్థులు…
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పదో తరగతి ఫలితాల్లో పత్తికొండ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. స్థానిక ఏపీ గురుకుల పాఠశాలలో సాధిక్ భాష అనే విద్యార్థి 600కు మార్కులకు గాను 560 ఎనిమిది మార్కులు సాధించారు. 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 75 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 93% ఉత్తీర్ణతతో పత్తికొండ ఏపీ గురుకుల పాఠశాల టాప్ లో నిలిచింది. అలాగే పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు పదోతరగతిలో తమ ప్రతిభను చాటారు. స్కూల్ మొదటి టాపర్ గా మైతాజ్ 564 మార్కులు,రెండవ టాపర్ ఆర్ వైష్ణవి 558 మార్కులు,మూడవ టాపర్ 555 మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచారు. పదో తరగతిలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు మిఠాయిలు తినిపించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ అభినందించారు. పరీక్షకు 187 మంది విద్యార్థులు హాజరుకాగా 108 మంది ఉత్తీర్ణత సాధించారు అని ఆమె తెలిపారు.
