నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు నగరంలో పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు..మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు నగరం లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా పారిశుధ్యానికి సంబంధించి గతంలో చెత్త సేకరణ విధానం అమలు చేస్తున్న ఏజెన్సీ ముందుకు రాలేదని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ కి వివరించగా, నగరంలో చెత్త సేకరణకు ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయాలని కోరుతామన్నారు.. దీంతో పాటు గతంలో చెత్త సేకరణ చేసే 91 మంది ఆటో డ్రైవర్లకు లోన్ ద్వారా ఆటో లు ఇప్పించే విధంగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తో మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. తద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడం తో పాటు నగరంలో పారిశుధ్యం కూడా మెరుగవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఏప్రిల్ 15 వ తేదీ నాటికి అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లలో నీరు సమృద్ధిగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, కాబట్టి నగరంలో నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.. అదే విధంగా మరమ్మతులు అవసరమైన హ్యాండ్ బోర్ వెల్స్ కు వెంటనే మరమ్మతులు చేయించాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.. నగరంలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం సక్రమంగా అమలు చేస్తేనే మంచి పేరు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.జనరల్ ఫండ్స్, నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం, స్మార్ట్ సిటీ కార్పొరేషన్, ఐఐఐటి డిఎమ్, అమృత్ పథకాల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా డ్రోన్ ల ద్వారా హంద్రీ నదిలో తదితర ప్రదేశాల్లో మలేరియా ఆయిల్ స్ప్రే చేయించడం వంటి చర్యలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.. ఎన్ని కిలోమీటర్లు చేశారు? ఎంత ఖర్చు పెట్టారు అనే వివరాలు కూడా డాక్యుమెంటేషన్ రూపంలో సిద్ధం చేయాలన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి వివిధ విభాగాల అధికారులపై వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు..సిబ్బందితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అధికారులు సక్రమంగా పని చేసేలా చూడాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు.సమావేశంలో కర్నూలు నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, ఎంహెచ్ఓ విశ్వేశ్వర రెడ్డి, సిటీ ప్లానర్, ఏఈ లు , మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.