NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోడల్ స్కూల్ హెచ్ యం ల జీతాలు చెల్లించండి…ఆపస్

1 min read

గుంటూరు, న్యూస్​ నేడు:   ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిఏర్పాటుచేసిన మోడల్ ప్రైమరీ స్కూల్స్ కు హెచ్ఎం పోస్ట్ తో పాటు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించడం హర్షణీయం అని,అయితే నూతనంగా ఏర్పాటు చేయబడ్డ మోడల్ స్కూల్ హెచ్ఎం పోస్టులకు సంబంధించి పొజిషన్ ఐడీలు, క్యాడర్ స్ట్రెంగ్త్ అప్డేట్ కాకపోవడం వల్ల గత నెల మరియు ఈనెల జీతాలుపొందలేకపోతున్నారని, వెంటనే విద్యాశాఖ మరియు ఆర్థిక శాఖ స్పందించి జీతాలకు ఇబ్బంది లేకుండా మోడల్ ప్రైమ్ స్కూల్ హెడ్మాస్టర్లకు జీతాలు చెల్లించాలనిఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల జరిగిన బదిలీల వల్ల నూతనంగా కేటాయించబడిన పోస్టులకు సంబంధించి పొజిషన్ ఐడిలు, క్యాడర్ స్ట్రెంత్ ఇబ్బందుల వల్ల రెండు నెలల జీతం తీసుకోలేకపోతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి జీతాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కార్యదర్శి సత్యనారాయణ . శ్రావణకుమార్ తది తరులు పాల్గొన్నారు.

About Author