NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలవరంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

1 min read

2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో భవన నిర్మాణం

ప్రారంభించిన ఏపీ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ ​నేడు :  భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా పోలవరం నూతన పోలీస్  స్టేషన్ భవనం  నిర్మాణం 10,123  స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో లో 16 రూములు, ఫస్ట్ ఫ్లోర్ నందు ఏడు రూములు మరియు  సెకండ్ ఫ్లోర్లో నాలుగు రూములు భవన నిర్మాణాన్ని 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మరియు విపత్తుల నివారణ శాఖామాత్యులు  వంగల పూడి అనిత, పోలవరం ఎమ్మెల్య బాలరాజు, ఆంధ్రప్రదేశ్ ట్రై చైర్మన్ బొరగం శ్రీనివాస్,ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పోలవరం పోలీస్ స్టేషన్ భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా పోలీస్ స్టేషన్ను నిర్మాణానికి రాష్ట్ర హోం మంత్రి  సహకారం ఎంతో ఉన్నదని హోంమంత్రి ఎక్కడ ఏప్పుడు మాట్లాడిన వారు మా పోలీసు అనే భావంతో మాట్లాడేవారని పోలీసు వారు అహర్నిశలు కష్టపడడాన్ని చూసి వారికి ఎక్కువ సదుపాయాలు కల్పించాలని ఆలోచించేవారని,దాని కొరకు డ్రోన్ లను వినియోగం పెంచారని అలాగే గతంలో గోదావరి నదికి వచ్చిన వరదలు సమయంలో హోం మంత్రి స్వయముగా పర్యటించారని, పోలీస్ స్టేషన్లో నిర్మాణాన్ని కొరకు సెంట్రల్ ఫండ్స్, స్టేట్ ఫండ్ ను అందించి మెరుగైన సదుపాయాలు నిర్మాణం లో కల్పించింన నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు పోలీసు వారు అందిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినారు. ఏలూరు రేంజ్ ఐజి శ్రీ జీవిజి అశోక్ కుమార్ ఐపీఎస్ వారు మాట్లాడుతూ ఈ భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని,పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం చాలా రోజుల నుండి అపరిష్కృతంగా ఉన్న విషయం గమనించిన రాజకీయ ప్రతినిధులు గమనించి సహాయ సహకారాలు అందించడం వలన భవన నిర్మాణం పూర్తి చేయగలిగారని భవిష్యత్తులో పోలవరం పర్యాటక క్షేత్రంగా ఉంటుందని భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరముగా మంచి సేవలు అందించే దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుందని,ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రివర్యులు మాట్లాడుతూ పోలవరం నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి పోలవరం ఎమ్మెల్యే  బాలరాజు గారు మరియు కార్పొరేషన్ చైర్మన్ బురగం శ్రీనివాసులు ఎంతో సహాయ సహకారాలు అందించారని 2019 వ సంవత్సరం నుండి పిల్లర్ స్థాయిలో ఉన్న పోలవరం పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం పూర్తి చేయడానికి ఏలూరు ఐజి ఏలూరు ఎస్పీ చాలా కష్టపడి భవన నిర్మాణం పూర్తి చేయడం అభినందదాయకమని, ఈ కార్యక్రమంలో  ఏలూరు జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్  ఎన్ సూర్య చంద్రరావు, పోలవరం డిఎస్పి ఎం వెంకటేశ్వరరావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డ్ ఇఇ జి.శ్రీనివాస రావు, డి ఈ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఏయ్ వై గోపి కృష్ణ, పోలవరం ఇన్స్పెక్టర్ సురేష్ బాబు,జిలుగుమిల్లీ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు,కుక్కునూరు ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి కుక్కునూరు వేలేరుపాడు టీ నర్సాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

About Author