NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోసపూరిత హామీలతో ప్రజలను మబ్బే పెట్టడంలో బాబు దిట్టా

1 min read

నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నరేన్ రామాంజులరెడ్డి

చెన్నూరు , న్యూస్ నేడు : నారా చంద్రబాబు నాయుడు అసత్యాలు, అబద్దాలు, మోసపూరిత వాగ్దానాలతో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడం జరిగిందని ప్రజలు ఆయనను నమ్మి అధికారం కట్టబెడితే  అధికారంలోకి రావడం ఆయన పద్ధతిలో ప్రజలకు మొండి చేయి చూపడం షరా మామూలేనని కమలాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి తెలిపారు. మండలంలోని కొండపేట గ్రామంలో బుధవారం ఆయన బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏవైతే 150 కి పైగా హామీలు ప్రజలకు ఇచ్చారో, అధికారంలోకి రాగానే హామీలన్నిటిని వదిలేసి ప్రజలను ఎలా మోసం చేశారో వివరించడం జరిగింది. ప్రజలను మోసగించడంలో చంద్రబాబు నాయుడు కు కొత్తేమి కాదని ఎన్నికల సమయంలోనే ఆయనకు ప్రజలు గుర్తొస్తారని, ఆ సమయంలో ఆయన నోటికి ఏదోస్తే ఆ హామీలను ప్రజలకు పరిపాటేనన్నారు. ఇప్పటివరకు అన్నదాతలకు అన్నదాత సుఖీభవకు ఎగనామం పెట్టారని తెలిపారు. అంతేకాకుండా మహిళలకు 1500 రూపాయలు, ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలికి వదిలేసారు అన్నారు. ఇవన్నీటిని మభ్యపరిచేందుకు వైసిపి నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ లాగా రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గత వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలన్నీ ప్రజల ఇంటి వద్దకే వచ్చేవని కానీ అలాంటి పరిస్థితులు నేడు లేవని తెలిపారు. గతంలో కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలను అసలే చూడం అర్హులు అయితే చాలు ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తానని చెప్పిన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని, నేడు అలాంటి పరిస్థితి కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదని ఏ పనైనా టిడిపి కార్యకర్తలకు చేయాలని, వైసీపీ కార్యకర్తలకు నాయకులకు చేయకూడదని చెప్పిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని ఆయన ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రజల పక్షాన పోరాడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మాజీ సభ్యులు మాసిమ బాబు, వైయస్సార్సీపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ముదిరెడ్డి దిలీప్ రెడ్డి, వైయస్సార్సీపి రాష్ట్ర మహిళ కార్యవర్గ సభ్యురాలు దాదిరెడ్డి భాగ్యమ్మ, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్,సొంట్టం నారాయణరెడ్డి, ఎంపీటీసీలు, దుంప నాగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మండల కో ఆప్షన్మెంబర్ వారిష్, శ్రీనివాసులు రెడ్డి, డలాయి కిరణ్, మైనార్టీ నాయకులు అన్వర్ భాష, హస్రత్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు

About Author