PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊదబత్తిల వ్యాపారి/ కాంట్రాక్టర్ కు జరిమానా…

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది దేవస్థానంలో ఊదబత్తిల వ్యాపారి/ కాంట్రాక్టర్ కొల్లి రమేష్ రెడ్డికి 5వేల రూపాయలు జరిమానా విధించినట్లు మహానంది దేవస్థానం ఈవో ఆచార్య కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం మహానంది దేవస్థానంలోని ఆలయ ప్రధాన గోపురం మరియు అత్యంత పవిత్రమైన జ్వాలా తోరణం నిర్వహించే ప్రాంతం పక్కనే ఎలాంటి అనుమతి లేకుండా ఆలయ నిషేధిత ప్రాంతంలో తమ యొక్క సొంత వాహనాలకు వాహన పూజ నిర్వహించడంతో 5వేల రూపాయలు జరిమానా విధించామన్నారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిఐపీలు, వీఐపీలు, మానసికంగా వికలాంగులు మాత్రమే అక్కడికి వాహనాల్లో వచ్చి దిగి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా నిషేధిత ప్రాంతంలో ఆ కాంట్రాక్టర్ తమ మూడు వాహనాలకు వాహన పూజ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆ కాంట్రాక్టర్ ఆలయంలోనికి వస్తున్నాడు అంటే అందరూ సెల్యూట్ చేయాల్సిందేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ అనుచరులతో ఇలాగే ప్రవర్తించి గర్భాలయంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా స్థానికంగా ఉన్న సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తుంది. దీంతో చీరెత్తిపోయిన ఆ కాంట్రాక్టర్ అధికారులకు మరియు పాలకమండలి లోని ఒకరికి ఫోన్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్ హుండీలో వేస్తామని అక్కడ సిబ్బంది అడ్డుకొని హెచ్చరించినట్లు సమాచారం. ఆయన ఆగడాలు భరించలేక ఈ పనికి ఉపక్రమించినట్లు విశ్వాసనీయ సమాచారం. సాధారణంగా ఫిర్యాదు ఉన్నా లేకున్నా సీసీ కెమెరాల రికార్డులు ఆధారంగా కూడా నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ మొత్తంలో మహానంది దేవస్థానం అధికారులు జరిమానా మరియు ఇతర చర్యలు తీసుకుంటున్నారు. కానీ దేవస్థానం నిషేధిత ప్రాంతంలో వాహనాల పూజ ప్రత్యేకంగా స్వతంత్రంగా ఆలయ పురోహితులతో నిర్వహించడం దీనికి కేవలం 5వేల రూపాయలు మాత్రమే జరిమాన విధించడం చర్చనీయాంశంగా మారింది. పాలకమండలిలోని ఒక వ్యక్తికి ఊదబత్తిల వ్యాపారి/ కాంట్రాక్టర్కు సున్నిత సంబంధాలు ఉండాయన్న ఆరోపణలతో కేవలం నామమాత్రపు జరిమానా విధించి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తుంది.. సాధారణంగా అయితే ఊదబత్తీలు అమ్మే షాపు ముందరనే వాహన పూజ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడంతో వారి యొక్క కాంట్రాక్టర్ రద్దు చేయాల్సి ఉంటుందేనే ప్రచారం. కానీ కేవలం జరిమానాతో సరిపెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

About Author