ఆకాశంలో ఢీకొన్న విమానాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు పొరపాటున ఢీ కొన్నాయి. ఓ విమానం గాల్లోనే పేలిపోగా.. మరో విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ లో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో జరిగిందీ దారుణం.. ఈ ప్రమాదంలో విమానాలను నడుపుతున్న పైలట్లతో సహా ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఒక విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానం కావడం గమనార్హం.