NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలకల్ లో ప్రారంభం కానున్న తితిదే ధార్మిక కార్యక్రమాలు

1 min read

పోలకల్​ , న్యూస్​ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సి. బెళగల్ మండలం, పోలకల్ గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం నందు మంగళవారం నుండి శుక్రవారం వరకు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబందించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంచే ఆవిష్కరింప చేశారు. మంగళవారం నుండి గురువారం వరకు సాయంత్రం 6-00 గం. నుండి మూడు రోజులపాటు కర్నూలు నగరానికి చెందిన ఈ. ఆర్. కె. వి. ప్రసాదరావుచే శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం సాయంత్రం 4.00 గం. నుండి గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ మందిరం అర్చకులు ఆవుల తిక్కన్న, జి. సోమప్ప, వై. వేంకటేశ్వర్లు, వై. శోభన్ బాబు, వై. శేఖర్, ఎ. దస్తగిరి, వై. గోపాల్, తపాల వెంకటేశ్, జె. సుంకన్న, డి. పరసురాముడు, డి. మల్లేశ్, బి. శ్రీనివాసులు, ఎ. చిన్నబసన్న, ఎ. పెద్దబసన్న తదితరులు పాల్గొన్నారు.

About Author