అరసం రాష్ట్ర నూతన కార్యవర్గంలో కర్నూలు జిల్లా నుండి ఇద్దరికి చోటు
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: మే 23,24 తేదీలలో తిరుపతిలో జరిగిన 83 వసంతాల అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా ఎంపికైన రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, వల్లూరు శివప్రసాద్ ల సారధ్యంలోని రాష్ట్ర కార్యవర్గంలోకి కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శిగా, కలం ప్రహ్లాద్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చోటు దక్కింది. ఈ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ కార్యవర్గంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా కర్నూలు జిల్లా అరసం అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరి ఎంపిక పట్ల అరసం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కేసీ మల్లికార్జున, రామ్మోహన్ రెడ్డి, సుధాకర్ బాబు, దాసరి వెంకటరమణ , రామళ్లకోట మానస మరియు జిల్లా సహకార్యదర్శులు పుల్లా రామాంజనేయులు, సయ్యద్ జహీర్ అహ్మద్ , ఎం సోమభూపాల్ , వై వెంకట్ రాముడు లు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు. వీరు సాటి అభ్యుదయవాదులతో కలిసి పనిచేస్తూ, సమైక్యపరుస్తూ ప్రజాసాహిత్య వికాసానికి మరియు అభ్యుదయ రచయితల సంఘం విస్తృతికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ , ఈ సందర్భంగా కొత్తపల్లి సత్యనారాయణను, కలం ప్రహ్లాదను వారు అభినందించారు.

