NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీఎం మోడీ ఫిట్నెస్ మంత్ర ‘అవగాహన సదస్సు

1 min read

మోడీ ఫిట్నెస్ మంత్ర ఇంటింటి ప్రచారానికి డాక్టర్ల సహకారం కోరిన యోగ శక్తి సాధనా సమితి

విజయవాడ, న్యూస్​ నేడు : 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు డాక్టర్ నోరి రామ శాస్త్రి ఆయుర్వేద కాలేజీలో జరిగిన’ పీఎం మోడీ ఫిట్నెస్ మంత్ర ‘అవగాహన సదస్సును  కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నిర్మల జ్యోతి భాయ్  సభకు అధ్యక్షత వహించారు.యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ ఫిట్నెస్ మంత్ర ఇంటింటి ప్రచారానికి డాక్టర్ల సహకారం అభ్యర్థించారు. మోడీ ఫిట్నెస్ మంత్ర యోగ ఆకుప్రెషర్ విభాగానికి చెందినదని, ఇది భారత సనాతన వైద్య విభాగానికి ప్రతీక అని తెలిపారు.దీని ద్వారా ప్రాణ శక్తి పెరగటం, అంతర పంచభూతాలు సమస్థితి ఏర్పడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,దీనితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని,త్వరితగతిన ఫలితాలు కూడా ఉంటాయని డాక్టర్ మాకాల తెలిపారు.ఆయుర్వేదం కూడా ఇలాంటి ఫలితాలు మరియు భారత సనాతన వైద్యం అని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. డాక్టర్ విజయ శాంతి కుమారి   మాట్లాడుతూ డాక్టర్ మాకాల చాలా మంచి సమాచారం ఇచ్చారు అని తెలిపి కృతజ్ఞతలు తెలిపారు. ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సుధాకర్ పర్యవేక్షణ చేసారు మరియు ఆయుష్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తో కార్యక్రమం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *