అనుగొండలో పోషణ మహోత్సవ సంబరాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS)ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లలో గత 25రోజులుగా కోడుమూరు సిడిపిఓ వరలక్ష్మి,లద్దగిరి సెక్టార్ సూపర్వైజర్ మల్లేశ్వరి సూచనలతో పోషణ మహోత్సవ సంబరాలు నిర్వహింపబడుతున్నాయి.అందులో భాగంగానే నేడు అనుగొండ గ్రామంలోని ఒకటవ సెంటర్లో అంగన్వాడీ టీచర్ ఉమాదేవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోషణ మహోత్సవాలు నిర్వహింపబడ్డాయి. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం మహేశ్వరి కూడా పాల్గొన్నారు. గర్భవతులు,బాలింతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉమాదేవి బాలింతలు, గర్భవతులు తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరిస్తూ, మారిపోతున్న జీవన విధానంలో మనిషి అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని, ఇలా కాకుండా ఉండాలంటే ప్రతిరోజు తాజా కూరగాయలు,ఆకుకూరలు తృణధాన్యాలు, సీజనల్ ఫ్రుట్స్ మన ఆహారంలో చేర్చుకోవాలన్నారు. ఒక్కొక్క ఆకుకూర ప్రత్యేకతను సవివరంగా గర్భవతులకు, బాలింతలకు తెలియజేయడం జరిగినది. ఏఎన్ఎం.మహేశ్వరి గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆరోగ్య సమస్యల పట్ల అనేక సూచనలు చేస్తూ పాలిచ్చే తల్లులు పిల్లలపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అనుగొండ గ్రామంలోని రెండు, మూడు సెంటర్ల అంగన్వాడీ కార్యకర్తలు సాలేశ్వరమ్మ, సులోచన, ఆయా అపర్ణ,ఆశా కార్యకర్తలు మద్దమ్మ, పద్మావతి, కాంతమ్మలు పాల్గొన్నారు.


