NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెబ్బటంలో “సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్”

1 min read

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, తల్లులకు అందుతున్న సేవల పరిశీలన

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు టీడీపీ ఇంచార్జి  వైకుంఠం జ్యోతి  ఆదేశాల మేరకు హొళగుంద మండల PACS చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హెబ్బటం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం “సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులు, తల్లులతో కలిసి అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సేవలను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలతో పాటు గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు.అంగన్వాడీ కేంద్రాలు కేవలం ఆహారం అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్య, మానసిక–శారీరక అభివృద్ధికి పునాది వేసే కేంద్రాలని కార్యక్రమంలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి తల్లి, ప్రతి చిన్నారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు.“మన అంగన్వాడీ – మన బాధ్యత.. మన పిల్లల ఆరోగ్యం – మనందరి బాధ్యత” అనే సందేశంతో ప్రతి కుటుంబం అంగన్వాడీ కేంద్రాల సేవల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్-1 ఇంచార్జి మల్లికార్జున్ బి, యూనిట్ ఇంచార్జి సవారప్ప, బూత్ కన్వీనర్లు శేక్షవాలి, గ్రామ కమిటీ నాయకులు పి. పాటయ్య, నాగయ్య, మాణిక్య, బీజేపీ కాళప్ప, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *