మధుమేహం వ్యాధిపై ముందస్తు చర్యలు
1 min read
వెలుగోడు, న్యూస్ నేడు: స్టార్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏపీవిహెచ్ఏ సహకారంతో ప్రపంచ మధుమేహ దినోత్సవం ను గవర్నమెంట్ హాస్పిటల్ నందు శనివారం ఘనంగా నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిలుగా వైధ్యదికారులు సింధు ప్రియ,భాను ప్రకాష్ పాల్గొని సభ్యులకు మరియు మహిళలకు ప్రపంచ మధుమేహ వ్యాధినిర్ధారణ , నివారణ గురించి తెలిపారు. ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలని , ఎక్సర్సైజ్ , ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పటం జరిగింది. అధిక దాహం ,తరచుగా మూత్ర విసర్జన , అలసట మరియు ద్రుష్టి మసకబారడం వంటివి ఉంటాయి అని చెప్పడం జరిగింది .మధుమేహంపై ఉన్న కళంకాన్ని తొలగించడానికి ఇన్సులిన్ వంటి అవసరమైన మందులు నిరంతరాయంగా , సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం మంచిది అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది కె.ఖాదర్ వలీ , లక్ష్మి మెరిబా సంస్థ అధికారి జుల్ఫీ అలీ ఖాన్ , జుబేదా , వైద్య సిబ్బంది మరియు ఇతర మహిళలు పాల్గొనడం జరిగింది .


