వేసవి లో నీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు
1 min read
మంత్రాలయం న్యూస్ నేడు : వేసవి కాలం ఎండలు తీవ్రంగా ఉండడంతో నీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెంకటరాముడు తెలిపారు. సోమవారం రాఘవేంద్ర పురం కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీటి సరఫరా చేసేందుకు పైపులైన్లు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం లో కూడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రామచంద్ర నగర్, సుజయీంద్ర నగర్, రాఘవేంద్ర పురం, పాత ఊరు లో నీటి సమస్య రాకుండా చూస్తామని తెలిపారు. తుంగభద్ర నది లో నీరు ఉన్నా లేకున్నా నీటి సమస్య రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.