ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ను కాపాడండి : ఆప్టా
1 min read
కర్నూలు: రాష్ట్రం లో జి ఓ 117 కు ప్రత్యామ్నంగా తెస్తున్న మార్పులో భాగంగా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాల ను 1 మరియు 2 తరగతుల తో ఏర్పాటు చేసి, అందులో 1:30 ఉపాధ్యాయ మరియు విద్యార్ది నిష్పత్తి ని ఏర్పాటు చేశారు.. ఇప్పుడు ఏర్పడే అనేక రకాల ప్రాథమిక పాఠశాల లో ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాల ల సంఖ్య అధికం. అందులో 20 నుండి 30 మధ్యలో నమోదు కల పాఠశాల ల సంఖ్య ఎక్కువ. అందువలన రాష్ట్రం లో ఏకోపాధ్యాయ పాఠశాల ల సంఖ్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. తరువాత కాలం లో ఏకోపాధ్యాయ పాఠశాల లు జీరో ఎన్రోల్మెంట్ తో మూత పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గతము లో ఉదాహరణలు చాలా ఉన్నాయి.ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాల లో కూడా 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయింపు జరగాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు లు వ్రాత పూర్వకంగా గౌరవ మానవ వనరులు శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబుకు , ప్రాథమిక విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు డైరెక్టర్ ప్రాతినిథ్యం చేశారు. అదేవిధంగా మోడల్ ప్రైమరీ పాఠశాల యందు ప్రధానోపాధ్యాయుడు గా సర్ప్లస్ గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ లను నియమించటం కంటే వారిని ప్రాథమికోన్నత పాఠశాల నియమించి వారి యొక్క విషయ పరిజ్ఞానం విద్యార్ధులకు అందించిన ప్రయోజనం ఉంటుందని వారు ప్రాతినిథ్యం చేయటం జరిగింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాల లకు ప్రధానోపాధ్యాయుడు గా సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ కల్పించి నియమించాలి అని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) గా ప్రాథమిక పాఠశాల మరియు విద్యార్ధుల క్షేమం కాంక్ష తో ఈ ప్రతిపాదన లు తాము మొదట నుండి చేస్తూ ఉన్నామని గౌరవ మంత్రి వర్యులు మరియు అధికారులు తమ యొక్క ప్రతిపాదనలు ఆమోదించవలెనని వారు కోరటం జరిగింది.