NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో ఎక్కడా సాగు, త్రాగునీటి సమస్య తలెత్తకూడదు

1 min read

అక్రమ నీటి మళ్లింపులేకుండా గట్టి నిఘా ఉంచాలి

తూడు తొలగింపు పనులు పరిశీలించిన కలెక్టర్

పంప్ హౌస్ వద్ద మొక్కలు నాటిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం దెందులూరు మార్కెట్ కమిటీ చెక్ పోస్టు సమీపంలోని ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును రెవిన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ, మత్స్యశాఖ, ఆర్ డబ్ల్యూఎస్, నగరపాలక సంస్ధ అధికారులతో కలిసి  కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు.ఈ సందర్భంగా  దెందులూరు కాలిబాట వంతెన వద్ద ఏలూరు కాల్వలో తూడు తొలగింపు పనులను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన సాగునీరు అందించడంతోపాటు ఏలూరు నగర ప్రజలకు త్రాగునీరు సరఫరాచేసే విషయంలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఏలూరు కాలువ ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను నీటితో నింపేందుకు అవసరమైన పర్యవేక్షణకూడా చేయాలన్నారు.వేసవిలో త్రాగునీటికి  ఎటువంటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఇరిగేషన్ కెనాల్స్ నుండి అనధికార సాగునీటి వినియోగం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చేపల చెరువులకు అక్రమంగా నీటి మళ్లింపులేకుండా ఏలూరు కాలువ కు సంబంధించి జిల్లా పరిధిలోని 30 కిలోమీటర్ల మేర ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, తహశీల్దార్లు కాలువ గట్ల వెంబడి క్షేత్రస్ధాయిలో పర్యటించి నిఘాఉంచాలన్నారు. రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందాలు గట్టినిఘా ఉంచాలన్నారు. అన్నిస్లూయుజ్ లపై కూడా  నిఘా ఉంచాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలోని మంచినీటి నీరు చెరువులను కాల్వలను మూసివేసేలోగా పూర్తిస్థాయిలో నింపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా సాగు, త్రాగునీటికి ఎటువంటి కొరతా లేకుండా అధికారులు పటిష్టమైన  చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతంలోని పొలాలకు సాగునీరు, గ్రామాలకు త్రాగునీటి కొరత లేకుండా చూడాలని, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూడు, గుర్రపుడెక్క వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఏలూరు కాలువ ద్వారా సాగు, తాగునీరు అందించే అంశంపై వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్బంగా ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి . నాగార్జునరావు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, తిరిగి మార్చి 25 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏలూరు కాలువ మూడున్నర అడుగుల మేర ఉందని వివరించారు. జిల్లా కలెక్టర్ వారి సూచన మేరకు రైతాంగానికి, ఏలూరు నగరప్రజల అవసరమైన త్రాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.  అనంతరం వాటర్ పంప్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ మెంబర్ ఎస్.ఎం.ఆర్. పెదబాబు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్,నగరపాలక సంస్ధ కమిషనీర్ భానుప్రతాప్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, జిల్లా మత్స్యశాఖ జెడి నాగలింగాచార్యులు, ఇంజనీర్లు పి . సుబ్రహ్మణేశ్వరరావు, ఎస్. సుబ్రహ్మణ్యేశ్వరరావు, తహసీల్దార్లు సుమతి, రమాదేవి,పూర్ణ,శ్రీనివాస్, నీటిపారుదల సంఘాల చైర్మన్ వెలమటి రామచంద్రప్రసాద్, సాగునీటి సంఘాల అధ్యక్షులు నెరుసు వెంకటరమణ, మాజీ సర్పంచ్ లుకలాపు సత్యనారాయణ, సాగునీటి సంఘం సభ్యులు బోసి ఎఫ్రాయిమ్,  స్థానిక రైతులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *