నిర్దేశిత గడువులోపు సమస్యలు పరిష్కరించాలి
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 21 అర్జీలు
నేడు న్యూస్ కర్నూలు జిల్లా బ్యూరో : ప్రజా సమస్యలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి, అర్జీదారుల మెప్పు పొందే విధంగా అధికారులు పనిచేయాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు సూచించారు. ప్రతి ఫిర్యాదుకు చట్ట పరిధిలో పరిష్కారం లభించేలా అవసరమైన చర్యలు జాప్యం చేయకుండా తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 21 అర్జీలు రాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, ఎంఈ సత్యనారాయణ, ఆర్ఓ జునైద్, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టిపిఆర్‌ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.