NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే కార్యక్రమం…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి  సీనియర్ సివిల్ జడ్జి  లీల వెంకట శేషాద్రి  ఆదేశాల మేరకు డిస్టిక్ లీగల్  సర్వీస్ ఆధ్వర్యంలో  ఈరోజు స్థానిక  నైస్ యూత్ ఫర్ కల్చర్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థ కార్యాలయంలో  నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. నిర్మల మాట్లాడుతూ ఇప్పటికి కూడా ఆడపిల్లలు గాని మగ పిల్లలు తమ తల్లిదండ్రులు తిట్టారని కొట్టారని మొదలైన కారణాలతో పారిపోవడం కొన్ని సందర్భాల్లో తప్పిపోవడం కూడా జరుగుతుంది .ఈ క్రమంలో వారు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి బస్సుల్లో గాని ట్రైన్ లో గాని ప్రయాణం చేసే  క్రమంలో పొరపాటున సంఘవిద్రోహశక్తులకు దొరికితే ఈ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు అనేది నాశనం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇట్లా తప్పిపోయిన పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని 24 గంటల్లోపు జిల్లా బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరిచి వారి ఆదేశాల మేరకు తాత్కాలికమైన షెల్టర్ నందు ఉంచడం జరుగుతుంది. అనంతరము ఈ పిల్లలు చెప్పే వివరాలను నమోదు చేసుకొని ఈ వివరాలన్నిటిని ట్రాకింగ్ మిస్సింగ్ చైల్డ్ అనే పోర్టల్ నందు నమోదు చేయడం జరుగుతుంది ఈ విధంగా నమోదు చేయడం వల్ల తప్పిపోయిన పిల్లల్ని త్వరగా ట్రేస్ అవుట్ చేయడానికి వీలవుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది .మరియు జిల్లా బాలల పరిరక్షణ అధికారి టి. శారద మాట్లాడుతూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ గాని ఆన్లైన్ మోసాలు గాని ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి బాలలు   ప్రమాదం ఎదురయ్యే సందర్భంలో వాళ్లు చైన్ హెల్ప్ లైన్ 1098 కి సమాచారం తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది .డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైల్డ్ లీగల్ రైట్స్ కమిటీ మెంబర్  రాయపాటి శ్రీనివాసులు  మాట్లాడుతూ చిన్నారులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండేలా తల్లిదండ్రులు సూచనలు  ఇవ్వాలని,  పిల్లలను సురక్షిత ప్రదేశాలలో ఉండేలా చూసుకోవాలని ఎక్కువ సమూహాల్లో ఉండే ప్రదేశంలో వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాలల అక్రమ రవాణా నిషేధ చట్టంపై అందరూ అవగాహన  కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో  డీ.సీ.పీ .యు  సిబ్బంది శ్రీలక్ష్మి, పద్మ,గీతా వాణి, నరసింహులు,నాగేశ్వరావు, శ్వేత ,కీర్తి ,రంగమ్మ  తదితరులు పాల్గొన్నారు.

About Author